కాంగ్రెస్ పాలన చాలా వింతగా ఉంది: కేసీఆర్..
కాంగ్రెస్ పాలన విచిత్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు…

