జమ్మూకశ్మీర్‌లోని కథువాలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జుతానాలోని అటవీ ప్రాంతంలో నలుగురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాక్కున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నాలుగో రోజు కొనసాగుతోందని అధికారులు…

