Editor

TELANGANA

బీజేపీకి రేవంత్ వార్నింగ్ – మరో ఉద్యమానికి శ్రీకారం..

పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయం జరుగే అవకాశాలున్నాయనే ఆందోళనల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటుగా ప్రజల్లోనూ చైతన్యం కలిగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. డీలిమిటేషన్ విషయమై తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో సమావేశమైన దక్షిణాధి రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత.. ఇకపై ఈ మహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ ఆకారం అందించనుంది అని ప్రకటించారు.   జాతీయ పార్టీగా ఉత్తర, దక్షిణాధి…

TELANGANA

తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? కేటీఆర్ తీవ్ర విమర్శలు..

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా చేసిందేం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.   అయోధ్య తలంబ్రాల పేరుతో రేషన్ బియ్యం పంచి ఎంపీ ఎన్నికల్లో ఒక్కసారి గెలిచారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సెంటిమెంట్ పూసి.. మాయ చేశారు తప్ప.. తెలంగాణ రాష్ట్రంలో వారి ఆటలు ఎప్పుడూ సాగలేదని ఆయన అన్నారు. తెలంగాణ…

TELANGANA

వడగళ్ల వానతో పంట నష్టం.. ఆరాతీసిన సీఎం చంద్రబాబు..

అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.   సమీక్షలో భాగంగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.…

TELANGANA

డీలిమిటేషన్ ఇష్యూ పై రియాక్ట్ అయినా డిప్యూటీ సీఎం పవన్..

దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. కేంద్రంలోని బీజేపీ సౌత్ రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందని ప్రాంతీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు చెన్నై వేదికగా సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశా నికి ప్రాంతీయ పార్టీలు సైతం హాజరయ్యారు. జనాభా ప్రాతిపదిక వ్యతిరేకించాలని నిర్ణయించారు ఆయా పార్టీలు. తాజాగా ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.   త్రిభాషా విధానంలో హిందీని నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదన్నారు పవన్…

TELANGANA

హైదరాబాద్ లోకల్ ట్రైన్ లో అత్యాచారయత్నం.. ట్రైన్ నుంచి దూకిన యువతి..

లోకల్ ట్రైన్ లో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక యువతిపై ఒక యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది.   మేడ్చల్‌లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువతి తన సెల్ ఫోన్ రిపేరు కోసం సికింద్రాబాద్ వెళ్లి, పని ముగిసిన తర్వాత తిరిగి లోకల్ ట్రైన్ లో బయలుదేరింది. ఆమె మహిళా కోచ్‌లో ప్రయాణిస్తుండగా,…

TELANGANA

నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు …

తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు.   ఈ డిమాండ్లపై కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌తో కలిసి ఆయన అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. దాదాపు పావుగంట పాటు ముఖ్యమంత్రితో మాట్లాడారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   అందుకే కలిశాం: హరీశ్ రావు   సికింద్రాబాద్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, సీతాఫల్‌మండిలో పెండింగులో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల…

AP

ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశాలు జారీ చేశారు.   ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే…

AP

డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం… దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్..

డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్ లో ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్… బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. వీరంతా…

AP

ప్రధాని మోదీకి జగన్ లేఖ..

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్టమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని… అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని…