అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ఆశలతో లాభాల బాట పట్టిన భారత స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీనికి తోడు, అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో, 2025లో వడ్డీ రేట్లను మరో రెండు సార్లు తగ్గించవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 566.96 పాయింట్లు లాభపడి 84,778.84…

