వరంగల్, హన్మకొండకు రెడ్ అలర్ట్: మొంథా తుఫాను బీభత్సం.. రైళ్లు నిలిపివేత, లోతట్టు ప్రాంతాలు జలమయం
మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొన్ని గంటలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో భారీ వర్షాలు పడటంతో, పరిస్థితి తీవ్రంగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం, కాపులకనపర్తిలో 25.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో, హన్మకొండ జిల్లా కలెక్టర్ శారద వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో రెడ్ అలర్ట్‌ను జారీ…

