గుర్తు లేని ఎన్నికల్లోనే 4 వేల స్థానాలు గెలిచాం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రేవంత్ సిద్ధమా? – హరీశ్ రావు
తెలంగాణలో పార్టీ గుర్తు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంచనాలకు మించి రాణించిందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విజేతల సన్మాన సభలో పాల్గొన్న ఆయన, కారు గుర్తు లేకపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 4,000 పైగా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారని వెల్లడించారు. సాధారణంగా అధికార పార్టీ 90 శాతం స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుందని, కానీ కాంగ్రెస్ కేవలం 64 శాతానికే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇది…

