Editor

TELANGANA

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు మళ్ళీ ఆటంకం..

SLBC టన్నెల్ అప్డేట్ : SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు మళ్ళీ ఆటంకం నిన్న కన్వేయర్‌ బెల్ట్‌ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. కానీ ఈరోజు కన్వేయర్ బెల్ట్ మళ్ళీ పని చేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి   దీంతో శిథిలాలు బయటకు తొలగించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది   టన్నెల్‌లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారని నమ్మకం లేక, నిరాశతో సొంత ఊర్లకు తిరిగి వెళ్తున్న బాధితుల కుటుంబ సభ్యులు

TELANGANA

బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్తాం: మల్లన్న..

TG: బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీవాదం తెలంగాణలో బలపడ్డ సూచనలు కనిపిస్తున్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ.. అధికార పార్టీ నేతలను వెనక్కి లాగేంత బలమైన శక్తిగా మారారని చెప్పారు. కులగణన లెక్కలు తప్పని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

National

అసెంబ్లీలోనే పాన్ మసాలా ఉమ్మేసిన ఎమ్మెల్యే..! ఎక్కడంటే..?

పరిసరాల పరిశుభ్రత ఎలాగూ పాటించని నేతలున్న దేశం మనది… అలాంటిది చట్టాలు చేసే సభలను అయినా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పరిశుభ్రత పాటించడం అంటే కోట్ల మంది ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నట్లే.. కానీ, బుద్ధిలేని ఓ ఎమ్మెల్యే ఏకంగా చట్టసభలోనే పాన్ నమిలి ఉమ్మేశాడు. సభ అనుకున్నారో లేక తానుండే ఇళ్లు అనుకున్నారో కానీ కనీసం ఆలోచన లేకుండా.. విధాన సభ ఎంట్రీ దగ్గర పాన్ నమిలి ఉమ్మేసి.. చట్టం గురించి, ప్రజల గురించి చర్చించేందుకు…

TELANGANA

మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళలకు సూపర్ కానుక ప్రకటించిన రేవంత్ సర్కార్..

మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళలకు సూపర్ కానుక ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పం తమదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలు చెప్పారు. ఆ మాట మేరకు మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

TELANGANA

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న తెలంగాణ ఎమ్మెల్యే..

సైబర్ నేరస్థులు ఏకంగా ఓ ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో వీడియోను కార్యకర్తలకు పంపించారు. నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..   నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేయగానే ఓ అమ్మాయి న్యూడ్ గా కనిపించడంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్…

AP

వైసీపీకి ప్రతిపక్ష హోదాపై అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు..

ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని చురక అంటించారు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. న్యాయ…

AP

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్..

జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. కూటమి అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. తద్వారా నాగబాబు రాజ్యసభకు వెళతారని, కార్పొరేషన్ ఛైర్మన్ అవుతారని జరుగుతున్న ప్రచారానికి జనసేన ముగింపు పలికింది. నాగబాబు పేరును మంత్రిగా గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమికి అసెంబ్లీలో ఫుల్ మెజార్టీ…

National

యూఏఈలో భారత మహిళకు మరణశిక్ష అమలు..! ఏం జరిగిందంటే..?

నాలుగేళ్ల చిన్నారి మృతి కేసులో భారతీయ మహిళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణశిక్ష అమలయింది. గత నెల 15వ తేదీన శిక్షను అమలు చేసినప్పటికీ, ఆ విషయాన్ని సోమవారం విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లోని జందా జిల్లాకు చెందిన మహిళ (30) నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణలపై అబుదాబీలో మరణ శిక్షను ఎదుర్కొంది. యుఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15న షహజాదీ ఖాన్‌కు మరణశిక్షను అమలు చేశారని విదేశాంగ…

TELANGANA

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత..

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లూ వున్న ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రేపటి (5వ తేదీ) నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9.05 గంటలకు వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి 9 గంటల వరకు ఓఎంఆర్ పత్రాన్ని…

AP

వైసిపికి మరో షాక్..! త్వరలో జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే..

ఇవాళ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో సహా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. పెండెం దొరబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని పెండెం దొరబాబు చెప్పగా, పవన్ కల్యాణ్ అందుకు ఆమోదం తెలిపారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ…