Editor

AP

పోసానిపై వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేశాం… అప్పుడు పట్టించుకోలేదు: జోగిమణి..

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జోగిమణి మాట్లాడుతూ… తమ నాయకుడు పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని అనుచితంగా మాట్లాడుతుంటే… తాము కూడా అలాగే మాట్లాడాలనుకున్నామని, అయితే అలా మాట్లాడొద్దని పవన్ సూచించారని తెలిపారు. సంస్కారం అడ్డొచ్చి తాము అలా మాట్లాడలేదని… పోసాని ప్రవర్తన సరిగా లేకపోవడం…

National

పూణె అత్యాచార ఘటన.. నిందితుడి ఫొటో విడుదల..!

పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పూణెలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతి(27)పై యువకుడు (36) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి ఇళ్లల్లో పని చేసే కార్మికురాలు. యథావిధిగా బస్సు ఎక్కేందుకు వస్తే.. వేరే చోట బస్సు  ఉందని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. స్నేహితురాలికి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మహారాష్ట్రలో మహిళలకు భద్రత కరవైందని ఆరోపించాయి. ఈ…

National

వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం. సవరణలు చేసిన బిల్లును ఫిబ్రవరి 19న కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల రెండో విడతలో భాగంగా బిల్లుపై చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ…

National

దారుణం.. ఐదుగురు బాలికలపై 18 మంది గ్యాంగ్ రేప్..

జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రానియా ప్రాంతంలో జరిగింది. ఒక వివాహం నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.   16 ఏళ్లకు పైబడిన బాలురను పెద్దలుగా పరిగణించి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ‘‘18…

TELANGANA

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్..! బయో ఏషియా-2025 ఈవెంట్‌లో సీఎం రేవంత్..

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా మారిందన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచంలో పేరుపొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు ఎన్నో పని చేస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు.   మంగళవారం హైటెక్స్‌లో బయో ఏషియా-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.…

TELANGANA

పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

మూడు నెలల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుంది. దీంతో రేవంత్ సర్కార్ అటు వైపు ఫోకస్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై దృష్టి పెట్టింది. మాతృభాష తెలుగును రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా భోదించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఓ సబ్జెక్టుగా ఉండనుంది.…

AP

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా..? వైసీపీకి పవన్ కల్యాణ్ వార్నింగ్..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ… గౌరవ గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు గారు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? అని నిన్నటి ఘటన తర్వాత నాకనిపించింది…

AP

కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు..? మరి వర్మ..?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. కూటమిలోని మూడు పార్టీలకు ఈ అయిదు స్థానాల్లో ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలనే దాని పైన సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు టీడీపీకి దక్కనుండగా.. బీజేపీ – జనసేనకు చెరో స్థానం కేటాయించేలా నిర్ణయం జరిగింద ని సమాచారం. ఇక, అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి జాబితాలో అనూహ్య ఎంపిక ఉండే…

National

భారత వ్యవసాయ రంగంలో ఏఐ అద్భుతాలు..!

కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎక్కడ చూసినా.. వినబడినా ఇదే పదం. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతున్నారు. అద్భుతాలు సృష్టించవచ్చని మరికొందరంటున్నారు. ఏఐ టెక్నాలజీని భారతీయ రైతులు వినియోగించుకోవడంతో నిమగ్నమయ్యారు. దీనివల్ల పంట దిగుబడిని పెంచుకోవడంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీనికి సంబంధించిన డీటేల్స్‌ను బయటపెట్టారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల.   టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా అరచేతిలో విశ్వ విజ్ఞానాన్ని చూస్తున్నాము.…

AP

టీడీపీకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన జీవీ రెడ్డి..

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూ కూడా జీవీ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించడం విశేషం.   ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి జీవీ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్…