Editor

AP

ప్రథమ్ థింక్ గ్యాస్ స్టేషన్లు ప్రారంభించిన ఏపీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కోస్టల్ ఏరియా ఉండడం ఓ వరమన్నారు సీఎం చంద్రబాబు నాయడు. ఆ కారణంగానే.. రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి భారీ ఎత్తున ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి పెద్దఎత్తున ఉన్నా, వినియోగంలో ఇంకా వెనుకబడి ఉన్నామని అన్నారు. తిరుచానూరు నుంచి రాష్ట్రంలో ఇంటింటికి సహజవాయువు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ.. అనేక అంశాల్లో ప్రభుత్వ ఆలోచనల్ని వెల్లడించారు.   తొలుత తిరుచానూరుకు…

TELANGANA

కౌశిక్ రెడ్డి తీరుపై KCR, KTR స్పందించాలి: మంత్రి పొన్నం..

కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్‌ను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టుకున్నారు.   గొడవ ఎక్కువవ్వడంతో కౌశిక్ రెడ్డిని…

AP

వైఎస్‌ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉండి ఉంటే.. అసలు ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగేది కాదని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.⁠ కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు. జిల్లా కలక్టరేట్ లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్ ని పక్కదారి పట్టించారని…

National

నేటి నుంచి మహా కుంభమేళా షురూ..

గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది. రాజ స్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్…

National

ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద మృతి..

అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోగి నివాసంలో శుక్రవారం రాత్రి కాల్పులు వినిపించాయి. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఆయన తలపై తుపాకితో కాల్చినట్లు కనిపించింది.   దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రెండు బుల్లెట్లను అధికారులు గుర్తించారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్లు కుటుంబ…

TELANGANA

వారికి రైతు భరోసా బంద్.. కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్..

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.   డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు…

TELANGANA

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలపై ఆరా..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు.   ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు పదే పదే అడిగారని, విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్.. కేసీఆర్‌కు వివరించారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావతోపాటు…

AP

మాకెందుకీ పదవులు, బోర్డు Vs అధికారులు మధ్య రచ్చ..

టీటీడీలో రచ్చ కొనసాగుతోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చర్యలు.. డిప్యూటీ సీఎం ఆగ్రహంతో పాలక మండలి అత్యవసర భేటీ అయింది. అధికారుల తీరు పైన బోర్డు సభ్యులు విరుచుకుపడ్డారు. తొక్కిసలాటకు కారణం అధికారులే అని ఫైర్ అయ్యారు. ఛైర్మన్, సభ్యులు నేరుగా అధికారుల పైనే గురి పెట్టారు. ఈవో లక్ష్యంగా సభ్యులు విమర్శలు చేసారు. దర్శన టోకెన్ల కోటా గురించి చర్చకు వచ్చింది. దీంతో, తొక్కిసలాట రచ్చ టీటీడీలో…

AP

కొత్త రేషన్ కార్డుల జారీ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై..

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు పూర్తయింది. తొలుత సంక్రాంతికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల ని భావించారు. కానీ, రెవిన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దరఖాస్తుల స్వీకరణ.. జారీ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.   ప్రభుత్వం కసరత్తు…