Editor

National

కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం..!

పహల్‌గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉగ్రవాదులు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికుల్ని టార్గెట్‌గా మారణహోమం సృష్టించడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.   అయితే, పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్థాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తి తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని…

AP

లిక్కర్‌ స్కామ్‌‌లో.. చాణక్య అరెస్టు..!

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రూపొందించిన నెట్వర్క్ నిర్వహణలో.. రాజ్ కెసిరెడ్డి ప్రతినిధిగా కీలకపాత్ర పోషించిన.. బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్‌ను సిట్ అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో.. ఎనిమిదో నిందితుడైన చాణక్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందటే చాణక్య దుబాయ్ కి పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతమవటం, సిట్ అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగించటంతో తప్పించుకునే మార్గం…

AP

బాగోతాలు బయటకు.. ముంబై నటి కేసు.. జైలుకి ఐపీఎస్ ఆంజనేయులు..

తోటి ఉద్యోగులు చేత సెల్యూట్ కొట్టించుకునేవారు.. సార్ అని అందరూ గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు కటకటాల పాలయ్యారు ఆ అధికారి. చాలామంది అధికారులకు ఆయన గుర్తు ఉండే ఉంటుంది సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో ఆయన గుట్టు అంతా బయట పెట్టేశారు అధికారులు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఆయన, నటి విషయంలో కొందరు ఐపీఎస్ అధికారులను ఎలా ఉపయోగించుకున్నారో కళ్లకు కట్టినట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.…

TELANGANA

చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కలిగి లేనప్పటికీ, తప్పుడు పత్రాలు సమర్పించి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు అందజేశారు. చెన్నమనేని రమేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ…

TELANGANA

ఆ పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటాం..-: కేటీఆర్ హెచ్చరిక

లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణకు విరాళం అందజేశారు.…

AP

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్..! ఏమైందటే..?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధినేత జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్…

National

లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:30 గంటలకు న్యాయాధికారి భాస్కరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు కెసిరెడ్డిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు.   అంతకుముందు, సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో…

National

పహల్గాం ఉగ్రదాడి… ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్ర‌ధాని మోదీ అత్య‌వ‌స‌ర భేటీ..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌ నేప‌థ్యంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్ర‌ధాని మోదీ త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భార‌త్‌కు తిరుగుప‌య‌న‌మ‌య్యారు. బుధ‌వారం ఉద‌యం ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగిన మోదీ… ఎయిర్‌పోర్టులోనే అత్య‌వ‌స‌ర భేటీ నిర్వ‌హించారు.   జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంక‌ర్‌, విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీతో స‌మావేశ‌మై…

National

కశ్మీర్‌లో టూరిస్టులపై కాల్పులు.. 27 మంది మృతి.. ఉగ్రవాదుల ఘాతుకం..

కశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్రవాదులు తుపాకులతో తెగబడ్డారు. పహెల్‌గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపారు. 27 మంది పర్యాటకులు మరణించారు. మరో 20 మంది టూరిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దాడి సమాచారం అందగానే జమ్ము కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెంటనే కశ్మీర్ బయలుదేరారు.   టూరిజం స్పాట్‌లో ఫైరింగ్   హిల్ స్టేషన్ అయిన…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వాఖ్యలు..!

బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విర్శంచారు. నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి…