Editor

TELANGANA

వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్..! జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ ఆహ్వానం   ఒసాకాలో జరుగుతున్న…

AP

ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్..! కారణం అదేనా..?

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు, కొద్దిసేపటి కింద ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. జెత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు.   ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలో సీఐడీ అధికారులు ఆయన్ని విచారించనున్నారు. ఆ…

AP

అమరావతికి ప్రధాని మోదీ.. లక్ష కోట్ల పనులకు మే 2న ప్రారంభోత్సవం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటించి, సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.   ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్…

TELANGANA

జపాన్ లో మరో రెండు కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం ఎంవోయూ..

తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా బృందం ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది.   తెలంగాణ యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జపాన్‌కు…

AP

మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం..! ఏం జరిగిందంటే..?

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడులో ముస్లింలు చేపట్టిన ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం ఎదురైంది. తమ ర్యాలీని రాజకీయం చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముస్లింలు కోరడంతో చేసేదేమీ లేక రజని వెనుదిరిగారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ర్యాలీ చేపట్టారు.   ముస్లింలకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి రజని…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో డేంజర్ జోన్‌లో వ్యర్థాల తొలగింపు కోసం ప్రయత్నాలు..!

ఎస్ఎల్‌బీసీ సొరంగం డేంజర్ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సొరంగంలో రెండు నెలలుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, డేంజర్ జోన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, సహాయక సిబ్బంది నిరంతరం చర్చిస్తున్నారు.   సొరంగం మార్గంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లతో పాటు ప్రమాద సమయంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్ర భాగాలను ఇదివరకే వెలికి తీశారు. అక్కడి నుంచి మరో 43 మీటర్లను డేంజర్ జోన్‌గా గుర్తించారు.…

National

భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈసీఐ రాజీపడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు.   “మహారాష్ట్రలో అర్హులైన వయోజనుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు…

AP

ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత లేఖ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వయోపరిమితిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం రామకృష్ణ లేఖ రాశారు.   2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు.…

AP

సిట్ విచారణ అనంతరం విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్… కీలక విషయాలు వెల్లడి..!

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనను సిట్ అధికారులు నాలుగు విషయాల గురించి అడిగారని తెలిపారు. తాను ఇచ్చిన సమాధానాలతో వారు తృప్తి చెందారనే అనుకుంటున్నానని చెప్పారు.   గతంలో జరిగిన రెండు సమావేశాల గురించి అడిగారని… ఆ రెండు సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏం…

AP

‘స్వచ్ఛ ఆంధ్ర’ ఏప్రిల్ నెల థీమ్ ను వెల్లడించిన సీఎం చంద్రబాబు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం వివిధ థీమ్ లను అనుసరిస్తున్నారు. ఏప్రిల్ నెల థీమ్ ను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.   “స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నాడు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా…