భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం ‘ధ్వని’..
భారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. దాని పేరు ‘ధ్వని’. హైపర్‌సానిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) అయిన ఈ క్షిపణి ఇప్పటికే ఉన్న అగ్ని-5ను మించి ఉంటుందని సమాచారం. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,500 కిలోమీటర్లు కాగా, ‘ధ్వని’ రేంజ్ 6 నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్షిపణిని మన లాంచ్ సైట్ల నుంచి ప్రయోగించి ఆసియా, యూరప్‌తోపాటు ఉత్తర అమెరికాలోని…

