కదిరి దేవస్థానంలో ప్రారంభమైన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రమం
శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, కదిరి. దేవస్థానం నకు సంబంధించిన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రము నేడు 10.02.2026 మంగళవారం ఉదయం నుండి ప్రారంభించడమైనది..
శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, కదిరి. దేవస్థానం నకు సంబంధించిన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రము నేడు 10.02.2026 మంగళవారం ఉదయం నుండి ప్రారంభించడమైనది..
ఈరోజు బేరిపల్లి కాలనీలో గొర్రెల మందపై కుక్కల దాడి చేయడం జరిగింది ఈ దాడిలో దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగింది ఈ కుక్కల దాడిలో బేరిపల్లి క్వార్టర్స్ లో నివాసం ఉండే అంజనమ్మ అనే గొర్రెల కాపరి మందపై ఈరోజు కుక్కల దాడి జరిగి దాదాపు పది గొర్రెలు నష్టం జరిగింది ఈ కుక్కల గురించి పట్టించుకున్న నాథుడు లేడు కమిషనర్ సార్ గారికి విన్నవించడం ఏమనగా బేరిపల్లి కాలనీలో కుక్కల బెడద గురించి పట్టించుకోవాలని…
సుమన్ టీవీకి కింది సెంటర్లలో పనిచేయుటకు విలేకరులు కావలెను. రాప్తాడు, అనంతపురం, సింగనమల, బుక్కరాయసముద్రం, పెనుగొండ, గోరంట్ల, పుట్టపర్తి, కనేకల్లు, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, ఉరవకొండ, కూడేరు, తాడిపత్రి, కదిరి, ఎన్ పి కుంట, ఒడిసి, నల్లమడ, ఆమడ గురు, ఎల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, చెన్నై కొత్తపల్లి, పెద్దవడుగూరు, గుత్తి, గార్లదిన్నె, మడకశిర, రొల్ల, చిలమత్తూరు, బెలుగుప్ప, బ్రహ్మసముద్రం, సెట్టూరు, విడపనకల్, సెంటర్లకు కావలెను ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి 9000144466 అనంతపురం, సత్యసాయి జిల్లా ఇంచార్జ్
కదిరి టౌన్, మూర్తిపల్లి గ్రామమునకు చెందిన ఎబ్బిలి చంద్రమౌళి, వయసు 35, తండ్రి నరసింహులు అను వ్యక్తి గత పది సంవత్సరాలు నుండి ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ నందు గల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, అతనికి భార్య లావణ్య, 04 సంవత్సరాల కుమారుడు కలడని, అయితే గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రభుత్వ కాలేజీ సమీపములో పురుగుల మందు తాగి ఇంటికి వెళ్ళగా అక్కడ అతనికి పరిస్థితి గమనించిన…
వదంతులకు చెక్ పెట్టిన ప్రకాశ్ రాజ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌ను తొలగించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకుడితో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారని వస్తున్న వార్తలపై ప్రకాశ్ రాజ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు. “నా షూటింగే మొదలు…
పసి వయసులో వేసే పసుపు తాడు వారికి అవుతుంది ఏదో ఒకనాడు ఉరితాడు అని కదిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వీవీఎస్ శర్మ అన్నారు ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కల్పించడానికి రూపొందించిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ను కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి వివిఎస్ శర్మ మరియు కదిరి డిఎస్పి శివ నారాయణ గారు మరియు కదిరి సిడిపిఓ రాధిక గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతను జోడించి పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సుమారు 1.40 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులను అందించడం ద్వారా సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 2026 నాటికి ఈ కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ…
హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘బడాబాయి’ (పెద్దన్న) అని సంబోధించడంపై ఒక జర్నలిస్టు ప్రశ్నించగా.. “ఆయన దేశానికి ప్రధాని, కాబట్టి ఖచ్చితంగా బడాబాయే. నేను హిందీలో చెప్పింది మీరు ఇంగ్లీష్‌లో ‘బిగ్ బ్రదర్’ అనుకోండి” అని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో టీన్యూస్ జర్నలిస్టును ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానిస్తూ.. “మీరు టీన్యూస్ ప్రతినిధి అయినంత మాత్రాన మీ ముఖంలో నేను కేసీఆర్‌ను…
ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి వాహనాల నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నగరంలో ఒక వ్యక్తి తన వాహనానికి మరొకరి నంబర్ ప్లేట్ తగిలించి తిరుగుతున్న ఉదంతం వెలుగులోకి రావడంతో, పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నంబర్ ప్లేట్లను మాస్క్ చేయడం, వంచడం లేదా మార్చడం వంటివి కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదని, ఇవి తీవ్రమైన…
కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈరోజు తన కార్యాలయంలో ‘చలో సేవాగడ్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. బంజారా సామాజిక వర్గానికి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం ‘సేవాగడ్’ (మహారాష్ట్ర) సందర్శనార్థం నిర్వహించనున్న ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గ ఎస్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..…