కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ..!
తన బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సుష్మితకు 38 సంవత్సరాలని, ఆమెకు 15 ఏళ్ల బిడ్డ, కొడుకు ఉన్నారని వివరించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. ఆ అంశంపై ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ…

