ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు .
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లూ ఎకానమీ దిశగా అడుగులు వేస్తూ ఆక్వా రైతులకు భారీ ఊరట కల్పించారు. కొత్త ఆక్వా కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.…

