Editor

AP

అమరావతికి ‘శాంసంగ్ సిటీ’.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు..

ఆంధ్రప్రదేశ్‌ను అత్యాధునిక సాంకేతికత, పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్‌) తయారీలో పేరొందిన డెల్టా ఎక్స్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీలో భారీ ఎత్తున తయారీ, పరిశోధన యూనిట్లను స్థాపించాలని ఆయన ఈ కంపెనీలను ఆహ్వానించారు.  …

TELANGANA

2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు: సీఎం రేవంత్‌..

2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 25కు పెరుగుతాయని అన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని తాము ముందే చెప్పి చేసి చూపించామని గుర్తు చేశారు. ఖమ్మం…

AP

చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, సోషల్ మీడియా నియంత్రణ వంటి అనేక అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, దానిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతోందని ఆయన స్పష్టం చేశారు.  …

TELANGANA

‘అన్న రాజ్యం’ కాదు.. ‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో చూపిస్తా: కవిత..

తెలంగాణ రక్షణ సేన ఎన్నికల్లో విజయం సాధిస్తే ‘అన్న రాజ్యం’ కాదు.. ‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతును నిజమైన రాజును చేస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక గౌరవ కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఒక వినూత్న ఆలోచన చేశామని… త్వరలోనే దాని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. ‘పాంచజన్యం’ అనే నినాదంతో మార్పు కోసం ముందుకు…

TELANGANA

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడమే తన వ్యక్తిగత కల అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.   హైదరాబాద్‌‍లోని గచ్చిబౌలిలో ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’తో పాటు గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి యూనివర్సిటీ లోగో,…

AP

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్..

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.   వివరాల్లోకి వెళితే.. మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు పదవుల ద్వారా రెండు సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ప్రకాశ్ రెడ్డి ఇటీవల…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ. 1,400 కోట్లపై విచారణ జరిపించాలి: కవిత..

బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1,400 కోట్ల నిధులు స్వచ్ఛమైనవి కావని అన్నారు. అవన్నీ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినవేనని ఆరోపించారు. ఆ నిధులపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, ఆ డబ్బును తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలి అని డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని…

AP

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వెనుక వైసీపీ ఉందని తేల్చేశారు సీఎం చంద్రబాబు. ఆయనకు వైసీపీ ఆర్థికసాయం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పురాణాలు, రాముడు, సీతపై నీచంగా మాట్లాడిన రావణ్ కు గొడ్డలిపార్టీ ఆర్థికసాయం చేసిందన్నారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు ఉన్నారని విమర్శించారు.   వైసీపీ-రావణ్ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు- గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సభలో ఆయన…

TELANGANA

కాంగ్రెస్‌లో ‘ఢీ’ అంటే ‘ఢీ’.. కడియంపై టీపీసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు..

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పార్టీ క్రమశిక్షణా కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి కడియంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేవాదాయ శాఖ మంత్రిగా తన అధికార పరిధిని ప్రశ్నించేలా ఇటీవల ఆయన వ్యవహరించిన తీరును ఆమె వివరించారు.   దేవాదాయశాఖ మంత్రిగా సీఎం రేవంత్…

TELANGANA

‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్..!

టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు తమ రూట్ మారుస్తున్నారు. జనాన్ని బురిడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ  ప్రక్రియను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను లూటీ చేసేందుకు సరికొత్త స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు.   ఎన్నికల అధికారుల పేరిట నకిలీ ఫోన్ కాల్స్   ప్రస్తుతం…