Editor

AP

పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత..

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నారని ఆమె వెల్లడించారు.   రాజకీయ కుట్ర కోణం లేకపోతే కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్… అంతదూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని హోం మంత్రి అనిత…

AP

రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం…

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు.   “వ్యాపార నిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), కార్యనిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్) రెండూ కలిసిన ప్రదేశం…

AP

లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా జరిగే 29వ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (SPIEF 2026)లో పాల్గొనేందుకు ఈ అనుమతి ఇస్తున్నట్లు సాధారణ…

AP

సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్..!

దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. మీడియాలో హైలైట్ కావాలనే.. ఏంటో తెలీదుగానీ సీఎం చంద్రబాబుపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మావిగన్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.   నెల రోజుల తర్వాత మీడియా ముందు జగన్   దాదాపు నెల రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు…

TELANGANA

రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ..!

తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నిస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కొండంత ధైర్యంతో బతికిన సాగు…

National

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాక్రోచ్ పార్టీ..! ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ..!

భారతదేశంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, దాన్ని పెద్ద పార్టీగా చేసేందుకు దశాబ్దాల కాలం పడుతుంది. కేవలం 5 రోజుల్లో… అవును, కేవలం 5 రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించి, ఏకంగా దేశాన్ని ఏలుతున్న అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను దాటేసిన ఒక వింత పొలిటికల్ మూవ్‌మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   దాని పేరే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party – CJP). ఏంటి..…

TELANGANA

కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు..!

తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాల పెంపునకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.   మూడు జోన్లుగా విభజన కార్మికుల కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు వీలుగా మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా వర్గీకరించింది. ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2…

National

పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్..!

2019 పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్‌లో ఒకడైన హంజా బుర్హాన్ అలియాస్ ‘డాక్టర్’ హతమయ్యాడు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.   చదువు పేరుతో వెళ్లి ఉగ్రవాదిగా.. హంజా బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. పుల్వామా జిల్లా రత్నిపోరా ప్రాంతానికి చెందిన అతడు 2017లో ఉన్నత చదువుల కోసమంటూ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘అల్-బదర్’లో చేరి కమాండర్‌గా ఎదిగాడు.…

AP

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్… భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్..

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు ‘చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ ఇవ్వొచ్చనిపించిందని, ఆయన అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, జగన్‌పై, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత కుటుంబాన్నే కాకుండా, సొంత జిల్లాను, నియోజకవర్గాన్ని కూడా జగన్ మోసం చేశారని ఆరోపించారు.   జగన్ కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు…

TELANGANA

ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పరిశ్రమల శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) అధికారులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.   అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’…