Editor

TELANGANA

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడి అధికారులు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు. కవిత బంధువుల ఇళ్ళలో ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది.   ఈ రోజు ఉదయం నుండి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కవిత కాల్ డేటా…

TELANGANA

లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోన్నాయి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లను ఇస్తోన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.   ఇప్పటికే బీఆర్ఎస్ పలు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మహబూబాబాద్- మాలోత్ కవిత, కరీంనగర్- బీ వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల…

AP

వైసీపీ మేనిఫెస్టోలో కీలకాంశాలు..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.   ఈ నెల 27వ తేదీన బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. అదే రోజున కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. 28న నంద్యాల,…

AP

చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి ఫోన్లు ట్యాప్..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎంత సంచలనంగా మారిందో చూస్తున్నాం. ప్రతిపక్ష నేతల ఫోన్లను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకమైన అధికారులను దీనికి నియమించి వారి ఫోన్లను ట్యాప్ చేయించారంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు…

National

కేజ్రీవాల్ ఇంట్లో 150పేజీల కీలక డాక్యుమెంట్లు.. ఈడీ అధికారులు షాక్..

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.   ఆయనను ఈ కేసులో మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలని ఈడి అధికారులు కోరగా, కోర్టు ఆరు…

TELANGANA

బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మితో దీపాదాస్ మున్షీ భేటీ: కేసీఆర్‌కు షాక్ తప్పదా..?

లోక్‌సభ ఎన్నికల ముందు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, మరో బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ సన్నిహితుడు కే కేశవరావు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.   శుక్రవారం బీఆర్ఎస్సీనియర్నేత కే కేశవరావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్మున్షీ భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని…

TELANGANA

ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ అనూహ్య ఎంపిక – మరో ఇద్దరి ప్రకటన..!!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు ప్రధాన పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశారు.   అభ్యర్థుల ఖరారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లోను పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను రెండు విడతలుగా ఖరారు చేసింది. బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించింది.…

AP

పిఠాపురం నుంచే పవన్ ప్రచారం-మూడు రోజులు అక్కడే.. !

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం సీటు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27న పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రెగ్యులర్ గా వెళ్లేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇవాళ జనసేన నేతలతో చర్చించి ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు.   ఈసారి ఎన్నికలకు తాను పోటీ…

AP

అభ్యర్థుల్లో చంద్రబాబు మార్క్ మార్పులు..

ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టిడిపి తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. అయితే గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల మార్పుకు సైతం చంద్రబాబు సిద్ధమవుతున్నారు.   చంద్రబాబు మార్క్ మార్పులు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటివరకు తమ పార్టీ నుంచి 139 మంది అభ్యర్థులను ప్రకటించారు. 13 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పనితీరు, ప్రజలతో మమేకమవుతున్న అంశాలను…

National

నేడు కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న ఈడీ..

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ను విచారించాలని ఇప్పటికి 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న రాత్రి సెర్చ్ వారెంట్ తో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు ఈడి అధికారులు .   ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో రెండున్నర గంటలపాటు అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించి,…