Editor

NationalTELANGANA

57 మందితో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా..

లోక్‌సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కూడిన మూడు జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిలను ఏఐసీసీ ఎంపిక చేసింది.   అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలోని పలు…

TELANGANA

నేడు సుప్రీంకోర్టులో ఈడీ అరెస్ట్ పై కవిత పిటీషన్ విచారణ.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒకదాని తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.   ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి గత ఐదు రోజులుగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత,…

AP

ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం..

ఎన్నికలవేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ..అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీలోనే మకాం వేసారు. పొత్తులో బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. కొన్ని మార్పులు కోరుతున్న బీజేపీ నాయకత్వం..తుది జాబితా ప్రకటన చేయనుంది. అటు బీజేపీ నాయకత్వం ఏపీలో ఎన్నికల బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.   బీజేపీ తాజా అడుగులు…

AP

టిడిపి అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం – అనూహ్య మార్పులు, లిస్టులో..!!

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలకు రంగం సిద్దమైంది. చంద్రబాబు ఈ రోజు లిస్టు విడుదల చేయనున్నారు. టీడీపీ తొలి రెండు జాబితాలో మొత్తం అసెంబ్లీ అభ్యర్థులనే ప్రకటించింది. తాజా లిస్టులో పార్లమెంట్ అభ్యర్థులతో పాటుగా పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేలా ప్లాన్ చేసారు. అయితే, జాబితాలో అనూహ్య నిర్ణయాలు కనిపిస్తున్నాయి. బిజెపితో పొత్తులో భాగంగా కేటాయించిన ఎంపీ సీట్ల పైన కొత్త అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు ప్రకటించే టిడిపి జాబితాలో కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి.…

National

లోక్ సభ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదల-మొదలైన నామినేషన్లు..!

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోరు నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగే తొలిదశ పోలింగ్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో ఆయా సీట్లలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. లోక్ సభ తొలి దశ ఎన్నికల నామినేషన్లను ఈ నెల 27 వరకూ స్వీకరిస్తారు. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఆ తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత…

AP

టీడీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత..?

సార్వత్రిక ఎన్నిల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. . వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మి ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు. పైగా పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. దీనికి తోడు సర్వేల్లో పనబాక లక్ష్మి వెనుక పడటంతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించారని…

AP

ఏపీలో నా మద్దతు ఆ పార్టీకే- తేల్చేసిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ..!

ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకీ, విపక్ష కూటమి ఎన్డీయేకూ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇద్దరూ ఎవరికి వారు ప్రజల్లో తమకే మద్దతుందని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీగా సభలు ఏర్పాటు చేసి ప్రజామద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో చిన్నా చితకా నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఫైనల్ గా ఈసారి ఎన్నికల్లో విజయం కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకునేందుకు రెడీగా ఉన్నారు.   ఈ నేపథ్యంలో ఒకప్పుడు…

TELANGANA

ఛీ..ఛీ ..ఏందిరా ఈ దరిద్రం..ఐస్‌క్రీమ్‌లో వీర్యాన్ని కలిపి అమ్ముతున్న ఘనుడు..

మనం తింటున్న ఫుడ్ ఎంత కలుషితం అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా అందరూ హోటల్స్, రెస్టారెంట్స్‌కు అలవాటు పడుతున్న పరిస్థితి. ఇక చిన్న పిల్లలు సైతం పానీ పూరి, ఐస్‌క్రీమ్‌లంటూ తెగ మారం చేస్తుంటారు. అయితే అవి ఎంత కలుషితం అవుతున్నాయో తెలియదు. తాజాగా నగర వాసులు విస్తుపోయే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.   ఐస్‌క్రీమ్‌లో వీర్యాన్ని, మూత్రాన్ని కలిపి అమ్ముతున్నాడు ఓ ఘనుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్…

TELANGANA

టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దులు ఖరారు – అనూహ్యంగా, లిస్టులో..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్త చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ సారి తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వరుస చేరికలతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్దులను ఖరారు చేసింది. కాంగ్రెస్ తమ అభ్యర్దులపైన నిర్ణయానికి వచ్చింది. తుది జాబితా ప్రకటనకు సిద్దమైంది.   ఎంపీ అభ్యర్దుల ఎంపిక : తెలంగాణలో…

National

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త తేదీలివే..

యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి.   గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న కారణంగా ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.…