Editor

TELANGANA

కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ ఫొటో..పార్టీ మార్పుపై క్లారిటీ..?

కాంగ్రెస్ పార్టీ నేతలతో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఫొటోలు వైరల్ కావడం చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్నేత ఈటల రాజేందర్స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డారు.   తాను కాంగ్రెస్‌లో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్అవుతున్న…

TELANGANA

గత పదేళ్ళలో ఇరిగేషన్ అవినీతి: ప్రాజెక్టులపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల..!

తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో నీటిపారుదల రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.   అనంతరం మాట్లాడుతూ…ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో అవినీతికి చోటులేకుండా, సమర్థ వినియోగంతో, అత్యధిక ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరం అయిన నిధులను సమకూర్చుకునే…

APNational

ఇస్రో మరో సక్సెస్- శ్రీహరికోట నుంచి నింగికి వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో కీర్తికిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్ధితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.   భూఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో…

Uncategorized

అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే: సీఎం జగన్ .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణాన తలపడేందుకు అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఆ పార్టీ జనసేనతోపాటు బీజేపీని కూడా కలుపుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మహా యుద్ధం…

AP

వైసీపీ భూస్థాపితం.. తొక్కుకుని వెళ్తామని చంద్రబాబు హెచ్చరిక..

వచ్చే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదిలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు…

National

ఢిల్లీలో రైతుల ఆందోళన, చలి తట్టుకోలేక కుప్పకూలిన రైతు, ఆసుపత్రిలో ప్రాణం పోయింది, అర్దరాత్రి..!

వివిధ డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు అడ్డుగోడ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ రైతు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఓరైతు మృతి చెందాడు. మరణించిన అన్నదాతను 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్‌గా గుర్తించామని అధికారులు అంటున్నారు.   జ్ఞాన్ సింగ్‌ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నివాసి అని అధికారుల విచారణలో తెలిసింది. గురువారం రాత్రి విపరీతమైన చలితో బాధపడుతున్న జ్ఞాన్ సింగ్‌ శుక్రవారం తెల్లవారుజామున మృతి…

TELANGANA

ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేరికలకు గేట్లెత్తేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటోన్నారు.   ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్…

TELANGANA

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.   అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. అయితే, నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు…

TELANGANA

పవన్ పోటీ నియోజకవర్గాలపై చంద్రబాబు కీలక సూచన..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ తుది దశక చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావటంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల పైన ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాల పైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం.   కొత్త…

AP

వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన సీమ సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.   ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు.…