Editor

TELANGANA

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అసలు విషయం చెప్పిన కేటీఆర్..

పదేళ్లపాటు కమిట్మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదేశించారని కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.   మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఆరున్నర లక్షల…

TELANGANA

అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు..ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.   ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని…

AP

జగన్ ఆపరేషన్ “గోదావరి”, పవన్ ఓట్ బ్యాంక్ పై గురి – అదే జరిగితే, ఇక నో ఛాన్స్..!!

ఏపీలో ఎన్నికల వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ, జనసేన పూర్తిగా స్థానిక సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలే అస్త్రంగా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేస్తన్నారు. ఇదే సమయంలో రెండు జిల్లాల పైన ప్రత్యేక ప్లాన్ అమలుకు సిద్దమయ్యారు.   జగన్ కొత్త…

AP

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్- హైకోర్టు కీలక నిర్ణయం…

ఏపీలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారాన్ని అధికార వైసీపీ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన 9 మంది వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇవాళ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. అయితే విచారణకు తక్కువ సమయం ఇచ్చిన స్పీకర్ నిర్ణయంపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.   ఈ మేరకు…

National

మాల్దీవుల పార్లమెంటులో రగడ… కోడిపుంజుల్లా కలబడిన ఎంపీలు..

భారత పొరుగు దేశం, చిన్న చిన్న దీవుల సమూహమైన మాల్దీవ్స్ పార్లమెంటులో ఆదివారం ఎంపీల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు మధ్య మొదలైన వివాదం.. తన్నులు, ముష్టిఘాతాల వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   మాల్దీవ్స్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఆదివారం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. కానీ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమద్ సొలెహ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి…

AP

నేడు వైసీపీ అయిదో జాబితా..

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అయిదో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.   నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం ఖరారు కావడం, తనను…

AP

ఈ 9 జిల్లాలతో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.   విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. జోష్‌ను నింపారు. ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు…

TELANGANA

రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు – బెర్తులు దక్కేదెవరికి..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ, పాలనా పరంగా వేగంగా తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన రేవంత్..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.   మంత్రివర్గ విస్తరణ : ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించారు. మొత్తం…

TELANGANA

నెలన్నర రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో 12 కోట్ల మంది మహిళల ప్రయాణం..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు లక్షలాది మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.   45 రోజుల్లో 12 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని సజ్జనార్ తెలిపారు. సగటున ప్రతి రోజు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు. నాంపల్లిలోని…

National

అయోధ్య‌లో ప్రారంభ‌మైన రాగ సేవ కార్య‌క్ర‌మం..45 రోజుల‌పాటు..

అయోధ్య రామమందిరంలో బాల‌క్ రామ్ విగ్ర‌హ ప్ర‌తిష్ట అనంత‌రం భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. ఇక్క‌డి బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం ప్రారంభ‌మైంది. అయోధ్య గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఈ సంగీత ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంద‌ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు వెల్ల‌డించారు.   ఈ సంగీత ఉత్స‌వం శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని…