Editor

TELANGANA

కేసీఆర్ ఈజ్ బ్యాక్…

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఎదుర్కొన్న భారత్ రాష్ట్ర సమితి.. లోక్‌సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు- మూడు తప్ప అన్ని లోక్‌సభ నియోజకవర్గాలపైనా సమీక్షలు పూర్తి చేసింది.   అటు అధికార కాంగ్రెస్ పార్టీపై దాడికి సమాయాత్తమౌతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి కోసం పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్‌కు అల్టిమేటాన్ని…

TELANGANA

రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ నెలాఖరు నాటికి ఈ-కేవైసీ గడువు ముగియబోతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.   ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం లబ్దిదారులు తమ రేషన్‌ కార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి ఈ-కేవైసీ విధానాన్ని…

AP

కౌంట్ డౌన్, మేము సిద్దం – సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..!!

ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. సీఎం జగన్ – టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ రోజు భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్దం అంటూ భారీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఇటు చంద్రబాబు రా కదలిరా సభల ద్వారా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.పీలేరు లో జరిగిన సభలో ముఖ్యమంత్రి పైన చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రులు రోజా..పెద్దిరెడ్డి తీరు పైన ధ్వజమెత్తారు.  …

AP

పవన్ ఎఫెక్ట్, టీడీపీలో సీట్ల రచ్చ – అచ్చెన్న నిలదీత, అల్టిమేటం..!!

టీడీపీ, జనసేన పొత్తులో రచ్చ మొదలైంది. సీట్ల పంచాయితీలు రోడ్డెక్కాయి. టీడీపీ మిత్రధర్మం పాటించకుండా సీట్లు ప్రకటించటం పైన పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ చేసిన ప్రకటనకు ప్రతిగా తాను రెండు సీట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు సీట్లలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీసారు. టికెట్ల పైన తేల్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేసారు.   పొత్తుల చిక్కులు :…

Uncategorized

తైవాన్ దేశస్థుడికి ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్ ప్రకటించిన కేంద్రం..!..

యావత్ దేశం నేడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. దీనికోసం దేశ రాజధాని ముస్తాబైంది. అన్ని చారిత్రాత్మక కట్టడాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మువ్వెన్నల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాల తనిఖీలను నిర్వహిస్తోన్నారు.   గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును ప్రకటించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్,…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని పీర్జాదిగూడకు చెందిన రాధిక.. పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేరశారు.   జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో…

TELANGANA

రాజ్‌భవన్‌లో ఎట్ హోం: సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు దూరం..

గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా రాజ్‌భవన్‌లో శుక్రవారం రాత్రి ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సహా మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆతిథ్యం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.   కాగా, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్హోం కార్యక్రమం జరగడం…

AP

మంత్రికి జగన్ మార్క్ షాక్ – బుట్టాకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఖరారు..!!

సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఇంఛార్జ్ ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంఛార్జ్ లను ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ అవసరమైతే మళ్లీ మార్పుల కు సిద్దం అవుతున్నారు. కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ సీటు కేటాయించారు. ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. దీంతో, జగన్ వెంటనే షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్దిని ఖాయం చేసారు. మాజీ ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు.…

AP

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనకు వచ్చే సీట్లివే ! కమెడియన్ పృధ్వీ లెక్క ఇలా..!

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ప్రతీ సీటును ప్రతీ పార్టీ కీలకంగా భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన అధికార వైసీపీ కూడా ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో చాలా చోట్ల ఇన్ ఛార్జ్ లను మార్చేస్తోంది. అటు వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్ష టీడీపీ-జనసేన సైతం సీట్ల పంపకాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ…

National

భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి గురువారం న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల నుంచి బీహార్‌లోకి ప్రవేశించేలా రూట్ ఛేంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలే ఇందుకు…