Editor

AP

ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రానున్న 100రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళం ముగింపు సభ… కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు.

TELANGANA

ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీలుగా మంత్రులు..

తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు.   రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ…

TELANGANA

మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా అందాలంటే – తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయిదు పథకాలకు సంబంధించి దరాఖాస్తులను స్వీకరించేందుకు మార్గదర్శకాలు సిద్దం చేసింది. రేషన్ కార్డులు లేని వారి నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రజలు ఒక్కో పథకానికీ ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించింది.   దరఖాస్తుల స్వీకరణ: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో.. ఐదింటినీ…

CINEMA

అంచనాలకు మించి ఉండబోతున్న సలార్ 2..

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సలార్ గురించి చర్చలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ను ఆన్ స్క్రీన్ ఎంత డైనమిక్ గా చూడాలి అని అనుకున్నారు ప్రశాంత్ నీల్ అంతకంటే డైనమిక్ గా చూపించేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి తగిన ఇమేజ్ ఉండే పాత్ర చేశాడు అని అందరూ అంటున్నారు. ఎంతో గ్రిప్పింగా సాగే కథ ,అంతకంటే అద్భుతంగా ఉన్న ఫైటింగ్స్ సన్నివేశాలతో…

AP

చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేట..!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో నారాలోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు.   తర్వాత.. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీతో ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం పనిచేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయన పూర్తి…

AP

చంద్రబాబుకు అప్పుడు జేపీ గండం… ఇప్పుడు జేడీ గండం!

గెలుపు ముంగిట ఓ పరిణామం జరగడం.. చంద్రబాబు ఓడిపోవడం ప్రతీసారి కామన్ గా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ఇలాగే బలమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కూటమి కట్టాడు. నాటి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో మహాకూటమి పెట్టారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు గెలిచేవారు. కానీ ఇక్కడే కాపులు ఆ పార్టీలు దెబ్బకొట్టాయి.   నాడు కాపు ఓటు బ్యాంకు టార్గెట్ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి.. నీతిమంత రాజకీయాలు…

TELANGANA

రుణమాఫీపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నారు. తాజాగా రేషన్‌ కార్డుల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరో కీలక హామీ అమలుపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వస్తూ రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి రేవంత్‌ ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.…

TELANGANA

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

ప్రతీ పథకానికి రేషన్‌కార్డే ప్రాతిపదిక.. ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్‌ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్‌ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

CINEMA

సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

భారీ అంచనాలతో ఈ రోజు విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ ను అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ.160 కోట్లకు సలార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

TELANGANA

సీఎం రేవంత్‌రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని ఎందుకు లేఖ రాసింది.. అందులో ఏముంది?

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో వరుసగా ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాధనంతో నిర్మించిన అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ప్రజాభవన్‌లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు,అభ్యర్థలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను…