Editor

AP

యువ సైన్యాన్ని సిద్ధం చేసుకున్న జగన్: సారథిగా బైరెడ్డి

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.   ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల…

CINEMA

సలార్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ లీక్.. అంత లేట్ అయితే ఫ్యాన్స్ ఊరుకుంటారా..!

తెలుగు సినిమా స్థాయి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అందులో కొంత మంది హీరోల రేంజ్ కూడా ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. అలాంటి స్టార్లలో ప్రభాస్ ఒకడు. ఆరంభంలో తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఇలా భారీ చిత్రాల్లోనే నటిస్తూ ముందుకెళ్తోన్నాడు.   కొంత కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు ‘సలార్’ అనే మూవీతో…

CINEMA

‘గూఢచారి’ సీక్వెల్ నుంచి అప్‌డేట్..

టాలీవుడ్‌ యాక్టర్ అడివిశేష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జీ 2’(G2). 2018లో విడుదలైన ‘గూఢచారి’ సినిమాకి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మేకర్స్ అభిమానులకు సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన‌ట్లు అడివి శేష్ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా ‘జీ2’ నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్: ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.! రేసులో ఆ సీనియర్ నేత..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి వర్గం ఏర్పాటైంది. కొత్తగా అసెంబ్లీ ఎన్నికైన వారు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు మినహా మిగిలినవారంతా ప్రమాణం చేశారు.   ఇక- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం లెజిస్లేచర్ సెక్రెటేరియట్.. కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఉదయం 10:30…

TELANGANA

రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్..

రైతుబంధు ఎప్పడిస్తారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో వరుసగా మంత్రులు స్పందిస్తున్నారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని.. తాము కూడా అలాగే ఇస్తామని తెలిపారు. ⁠బీఆర్ఎస్ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.   మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు డీసీసీ అధ్యక్షుడు…

AP

రాజీనామాల వేళ.. జగన్ మెరుపు నిర్ణయం: సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్: కొత్త ఇన్‌ఛార్జీ నియామకం..

గ్రేటర్ విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి (Tippala Devan Reddy) రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తోన్నట్లు తెలిపారు.   సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడే దేవన్ రెడ్డి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కల్యాణ్‌నే మట్టి కరిపించిన పేరును సాధించారు నాగిరెడ్డి. భారీ మెజారిటీతో పవన్‌ను ఓడించి, జెయింట్…

AP

వైసీపీలో మరో బిగ్ వికెట్ అవుట్..: ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ రాజీనామా: ఏం జరుగుతోంది..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొంటోంది. ఇంకో నాలుగు నెలల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించింది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఈ పరిస్థితుల్లో- గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియెజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల…

TELANGANA

రేవంత్ మంత్రివర్గంలోకి మరో ఆరుగురు…

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ లో మరో ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ సిద్దంగా ఉన్నారు. జాబితా సిద్దం చేసుకున్నారు. హైకమాండ్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ కనిపిస్తోంది.   కేబినెట్ విస్తరణ :…

AP

టీడీపీ తొలి జాబితా సిద్దం…

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీ-జనసేన పొత్తు వేళ అభ్యర్దుల పైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన నుంచి 50 అసెంబ్లీ -5 లోక్ సభ సీట్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. 30 అసెంబ్లీ -2 లోక్ సభ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ నుంచి 45 మందితో తొలి జాబితా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   చంద్రబాబు కసరత్తు: ఏపీలో ఎన్నికలు…

TELANGANA

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ..

తెలంగాణ సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రేవంత్ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ఆరోగ్యం పై ఆరా తీసారు. కొద్ది సేపు కేసీఆర్ తో ముచ్చటించారు. కేసీఆర్ కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను ఆరా తీసారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి సీఎం రేవంత్ : సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మార్క్…