‘అఖండ 2’కు తెలంగాణ హైకోర్టు షాక్: టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్!
నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ చిత్రానికి విడుదల ముందు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు తక్షణమే సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని గంటల్లోనే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం చిత్రయూనిట్‌కు ఊహించని షాక్‌గా మారింది. ‘అఖండ 2’…

