Editor

AP

చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టు కీలక నిర్ణయం..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లకూ, ప్రభుత్వ న్యాయవాదులకూ మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉంటున్న చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇవాళ రెగ్యులర్ బెయిల్ పై వాదనలు సాగాయి.   Advertisement ఇవాళ ముందుగా…

TELANGANA

కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలం: లెక్కలు చెప్పిన చిదంబరం..

తనకు తెలంగాణతో 2008 నుంచి అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన తనకు బాగా గుర్తుందన్నారు. మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.   Advertisement తెలంగాణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశంలోని అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు.…

CINEMA

మంచు లక్ష్మి – అల్లు శిరీష్ ప్రైవేట్ ఫొటోలు వైరల్.

సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. మంచు లక్ష్మికి హీరో అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..   Advertisement మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్…

National

ఇంటింటికీ మోడీ పథకం-ఎల్లుండి నుంచి రెండునెలల ప్రచారం- 21 రాష్ట్రాల్లో…

ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రజల్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని చేరుకోవడం, అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూసేందుకు ఓ భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో జార్ఖండ్ లో నవంబర్ 15న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.   Advertisement…

TELANGANA

కాంగ్రెస్ వస్తే రైతులు అరేబియా సముద్రంలోకే: కేసీఆర్ హెచ్చరిక

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ (KCR).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.   Advertisement విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్కృషి…

TELANGANA

కాంగ్రెస్ నేతల మంత్రాంగం సక్సెస్ – నో రెబల్స్…!!

తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొచ్చే సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలతో సీట్ల కోసం భారీగా పోటీ కొనసాగింది. టికెట్ రాక పోటీలో నిలిచిన రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్దుల విజయానికి సహకరించేందుకు అంగీకరించారు. పార్టీ అధికారంలోకి రావటం కోసం పని చేస్తామని వెల్లడించారు. వీరితో పార్టీ ముఖ్య నేతలు చేసిన మంత్రాంగం ఫలిచింది. దీంతో, ఇక..గెలుపే లక్ష్యంగా ప్రచారం స్థాయిని పెంచేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.   Advertisement కాంగ్రెస్ ముఖ్య నేతల…

AP

రాష్ట్రంలో కీలకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్..

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభమైంది. బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఐదు గ్రామ/వార్డు సచివాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారు. ఈ నివేదికలను పరిశీలించి నిర్వహణ, విధానపరమైన అంశాలను క్రోడీకరించనున్నారు. బుధ, గురువారాల్లో అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు దీనిపై సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది.   Advertisement ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విజయవాడ, విశాఖపట్నం, 24న తిరుపతిలో కుల గణనపై…

National

ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసింది. 2004 నుంచి ఎర్ర చందనం పెంపకంపై కేంద్రం ఆంక్షలు విధించగా తాజాగా వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎర్ర చందనంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ప్రకారం ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.

CINEMA

రణబీర్ తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’..

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో కి ఈసారి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విచ్చేస్తున్నాడు. ఈ మేరకు ‘ఆహా’ నుంచి అధికారికంగా అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో రణబీర్, రష్మిక, సందీప్ వంగా ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఇది శాంపిల్ మాత్రమే. అసలు సిసలు షో ఇంకా ముందుంది మేరా దోస్త్! అంటూ…

AP

టీడీపీ ఆఫీస్ కు సీఐడీ నోటీసులు..

ఏపీ టీడీపీకి సీఐడీ మరో షాకిచ్చింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని కోరింది. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు సీఐడీ కానిస్టేబుల్‌ నోటీసు అందించారు. ఈనెల 18లోగా కోరిన వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.   పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు చెప్పాలని అని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఈ నెల 18న సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ నోటీసుల్లో…