గజ్వేల్‌లో కేసీఆర్ బాధితులే నా ఓటుబ్యాంకు : ఈటల రాజేందర్
తెలంగాణ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా ఢీకనబోయే నేతలలో ఒకరైన ఈటల రాజేందర్(Eetala Rajender) ఒకరు. కేసీఆర్ పోటీచేయబోయే గజ్వేల్ నుంచి బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. “పదేళ్లలో కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదు.. కేవలం ఎన్నికల ముందు గుర్తొస్తున్నారు. నేను ఇక్కడ పోటీ చేస్తున్నాని తెలియగానే బీఆర్ఎస్(BRS) నేతల గుండెల్లో…

