Editor

TELANGANA

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు…

తెలంగాణ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముందు కీలక నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై బీజేపీ ప్రదర్శిస్తున్న సాఫ్ట్ కార్నర్ ను చూడలేకే తాము పార్టీ మారుతున్నామని వారు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గతంలో కీలక పాత్ర పోషించి వేర్వేరు కారణాలతో పార్టీ మారిన కీలక నేతలంతా ఇప్పుడు ఘర్ వాపసీ అంటూ హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపుతున్నారు.   ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తితో ఉన్న…

AP

సుప్రీం కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై పిటీషన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తు కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం పిటీషన్ దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ఈ పిటీషన్ వేశారు. ఈ కేసుల్లో విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీచేయాలని ఆయన ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.   “జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా…

National

81.5 కోట్ల మంది ఆధార్ డేటా చోరీ…

దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.   డేటా చౌర్యానికి గురైన విషయం అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెక్యూరిటీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆధార్ లో నిక్షిప్తమైన 81.5 కోట్ల మంది బయోమెట్రిక్ వివరాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్టు సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో…

TELANGANA

రాజకీయ దుమారం రేపుతోన్న దుబ్బాక ఘటన.. పార్టీల విమర్శనాస్త్రాలు..

తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థిపై కత్తి పోటు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటన వెనుకు కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయని గులాబీ నేతలు ఆరోపిస్తుంటే.. ఆ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. హింసను తాము ప్రేరేపించమని.. దీనిపై వెంటనే విచారణ జరిపాలని డిమాండ్ చేస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.   తెలంగాణలో ఎలక్షన్‌ హీట్‌ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచార జోరులో ఉన్నారు. ఈ క్రమంలో దుబ్బాక బీఆర్‌ఎస్‌…

CINEMA

కాక్‌ టెయిల్‌ పార్టీ.. ఇటలీలో మెగా ఫ్యామిలీ సందడే సందడి..

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. ఏడడుగులు వేసి ఏడు జన్మల అనుబంధంలోకి అడుగుపెట్టబోతున్న ఈ మెగా దంపతుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇటలీలో వీళ్ళ పెళ్లి సంబరాలు ఘనంగా జరపడానికి మెగా కుటుంబం మొత్తం తరలి వెళ్ళింది. మెగా వారి పెళ్ళి సందడి ఇటలీలో కూడా ఘనంగా కనిపిస్తుంది. ఇక ఈ పెళ్ళికి సంబంధించి పలు రకాల ఫంక్షన్స్ తో అటు మెగా కుటుంబం ఇటు అల్లు కుటుంబం…

AP

52 రోజుల తర్వాత.. జైలు నుంచి విడుదల.. తొలి స్పీచ్..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్‌ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబును చూసి టీడీపీ నేతలు భావాద్వేగానికి గురయ్యారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు.   జైలు నుంచి బయటకు రాగానే చంద్రబాబు మాట్లాడారు. తాను జైలులో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపించారని అన్నారు. భారత్ దేశంలోనేకాదు ప్రపంచ దేశాల్లో చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోలేనన్నారు. తాను చేసిన…

TELANGANA

కొల్లాపూర్ లో పాలమూరు ప్రజాభేరి.. 6 గ్యారంటీలే గెలిపిస్తాయని రేవంత్ ధీమా..

కొల్లాపూర్‌ లో కాంగ్రెస్‌ పాలమూరు ప్రజాభేరి సభకు ప్రజలు పోటెత్తారు. ఈ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో రాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హెలికాఫ్టర్ ప్రయాణం రిస్క్ అని చెప్పినా రాహుల్ గాంధీ తెగించి వచ్చారన్నారు.   బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మరో లక్ష కోట్లు దోచుకుంటారని ఆరోపించారు. కాంగ్రెస్…

CINEMA

క్లీంకారా ఫేస్ రివీల్ చేసిన ఉపాసన.. వైరల్ ఫోటో!..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్-ఉపాసన‌ దంపతులకు క్లీంకారా పుట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేయలేదు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఇటలీలో ఉంది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో దిగారు. అందులో క్లీంకారా ఫోటోను కవర్ చేసినా.. దాని రిఫ్లెక్షన్ వాటర్‌లో పడింది. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

HealthNational

కోవిడ్ కారణంగా తీవ్రంగా బాధపడ్డారా..? అయితే మీకే ఈ అలెర్ట్..

కరోనా ప్రపంచాన్ని ఎంత దడదడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాయదారి రోగం బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాక్సిన్స్ వచ్చాయన్న ధైర్యం ఉన్నా.. ఈ మహమ్మారి రూపం మార్చుకుని ఎలా అటాక్ చేస్తుందోనన్న ఆందోళన కూడా జనంలో ఉంది. కాగా ఇటీవల గుండెపోటు మరణాలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో.. కేవలం వయస్సు మీదపడిన వృద్ధులు మాత్రమే గుండెపోట్లతో ఎక్కువగా చనిపోయేవారు. కానీ ఇటీవలి కాలంలో ఫిట్‌గా…

TELANGANA

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి.. కేసీఆర్‌పై జరిగినట్టే..!..

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణలో కలకలం రేపింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని మొదట గజ్వేల్‌లోని ఆస్పత్రికి…