మేడారం హుండీలో భక్తుల వింత కోరికలు.. అమ్మవార్లకు ప్రేమలేఖలు, సమస్యల విన్నపాలు!
మేడారం మహా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 828 హుండీల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. సుమారు 500 మంది సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు నిర్వహిస్తుండగా, భక్తులు సమర్పించిన లేఖలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హుండీల్లో కేవలం కానుకలే కాకుండా, తమ మనసులోని బాధలను, కోరికలను కాగితాలపై రాసి అమ్మవార్లకు నివేదించుకున్నారు. ఈ లేఖల్లో భక్తులు వైవిధ్యమైన సమస్యలను ప్రస్తావించారు. కొందరు తమ ప్రేమలేఖలను హుండీలో వేయగా, మరికొందరు…

