రాజకీయాల్లోకి రాను.. మూగజీవుల హత్యలపై మౌనం వహించను: రేణు దేశాయ్
హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో యాంకర్ రష్మీతో కలిసి నిర్వహించిన సమావేశంలో రేణు దేశాయ్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమె కరాఖండిగా చెప్పారు. కేవలం సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, జంతు ప్రేమికురాలిగా మాత్రమే తాను సమస్యలపై స్పందిస్తున్నానని వివరించారు. పదవుల కోసం కాకుండా, మూగజీవుల రక్షణే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా…

