Editor

AP

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..!

ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్‌ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు…

AP

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనం..!

భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో…

CINEMA

సెన్సార్ బోర్డుకు కాలం చెల్లింది: రామ్ గోపాల్ వర్మ..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై, దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని, దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన అభిప్రాయపడ్డారు. నటుడు విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.   “ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని భావించడం అవివేకం. దాని అవసరం ఎప్పుడో…

TELANGANA

రైతులకు సంక్రాంతికి మరో తీపికబురు చెప్పిన రేవంత్ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఫిడవిట్ దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.   సాదా బైనామా సమస్యల పరిష్కారానికి జీవో మరో రెండు…

TELANGANA

కరీంనగర్ కు కేంద్రం గుడ్ న్యూస్..! ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కరీంనగర్ జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్ తీపికబురు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ జిల్లాలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 50 పడకల సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాలో ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్రం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.   ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్ల…

CINEMA

ది రాజాసాబ్: ప్రభాస్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేపు (జనవరి 8) సాయంత్రం నుంచి పడనున్న ప్రీమియర్ షోలతో పాటు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. మారుతి దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్…

AP

తనకల్లు పోలీస్ స్టేషన్ వద్ద ఈశ్వరప్ప హత్య కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఈశ్వరప్ప ను హత్య చేసిన నిందితులు అరెస్ట్ మీడియా సమావేశంలో కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి కామెంట్స్ ఈశ్వరప్ప ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు హత్య చేసిన నిందితులు హరి,శంకరప్ప, గంగులప్ప,చిన్నప్ప లు అరెస్ట్ ఐదు రోజుల క్రితం హరి భార్యను తీసుకువెళ్లిన ఈశ్వరప్ప హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసాం తిరుపతి జిల్లా గూడూరులో ఈశ్వరప్ప…

AP

వైఎస్సార్‌సీపీకి జెండా ఉంది కానీ అజెండా లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

కదిరి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం వై యస్అర్ సీపీకి జెండా ఉంది… కానీ అజెండా లేదన్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను పదేపదే వైఎస్సార్సీపీ నేతలు వినిపిస్తున్నారన్న ఎమ్మెల్యే రాయలసీమ కోసం 1983లోనే ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొచ్చారన్న వెంకట ప్రసాద్ తెలుగు గంగా వాస్తవాలు ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని పిలుపు హంద్రీనీవా, గాలేరు నగర్, హౌక్ రిజర్వాయర్—ఎన్టీఆర్, చంద్రబాబు కృషేనన్న…

AP

యువతకు రూ.15,000 విలువైన క్రికెట్ కిట్లు వితరణ బిజెపి నాయకుడు షేక్ సమివుల్లా…

సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ యువతకు బిజెపి నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా రూ.15,000 విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను బుధవారం అందజేశారు. క్రికెట్ కిట్ల కోసం గౌకనపల్లి యువత చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన షేక్ సమివుల్లా, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గౌకనపల్లి గ్రామానికి, నంబులపూలకుంట మండలానికి మంచి…

AP

సమస్యల పరిష్కారంపై.. సహకార సంఘం ఉద్యోగుల ఆందోళన..

  కదిరి, జనవరి 7 పట్టణంలోని ఎడిసిసి బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల సి.ఇ.ఒలు ఇతర ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షల సందర్భంగా సంఘంలో ఎలాంటి లావాదేవీలు జరపమని పేర్కొన్నారు. ఇ.ఆర్.పి లాగిన్ చేయమని, ఎరువులు, ధాన్యం కొనుగోలు, పిడిసి, పెట్రోల్ బంకులు, మెడికల్ దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సేవలు నిలిపివేసినట్లు స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. జి.ఒ నెంబర్ 36 అమలు,…