తెలంగాణకు ప్రధాని మోదీ..! మే 9న భారీ బహిరంగ సభ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో తెలంగాణ బీజేపీ ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మే 9వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించి పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను దిగ్విజయం…

