చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ప్రశంసలు
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశం ఒక సూపర్ పవర్‌గా ఎదిగిందని కొనియాడిన ఆయన, 21వ శతాబ్దం భారతదేశానిదేనని స్పష్టం చేశారు. NDTV వరల్డ్ సమ్మిట్‌లో ప్రసంగించిన ఆయన, ప్రపంచంలోని కొత్త సూపర్ పవర్లలో ఒకటిగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ‘ప్రజాస్వామ్య ప్రతిరూపం’గా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. నాలుగు లేదా ఐదు దశాబ్దాల తర్వాత అమెరికాను వెనక్కి నెట్టి భారత ప్రధాని ‘స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు’ హోదాను పొందే అవకాశం ఉందని…

