“మోదీ కచ్చితంగా బడాబాయే..”: టీన్యూస్ జర్నలిస్టుకు రేవంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘బడాబాయి’ (పెద్దన్న) అని సంబోధించడంపై ఒక జర్నలిస్టు ప్రశ్నించగా.. “ఆయన దేశానికి ప్రధాని, కాబట్టి ఖచ్చితంగా బడాబాయే. నేను హిందీలో చెప్పింది మీరు ఇంగ్లీష్‌లో ‘బిగ్ బ్రదర్’ అనుకోండి” అని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో టీన్యూస్ జర్నలిస్టును ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానిస్తూ.. “మీరు టీన్యూస్ ప్రతినిధి అయినంత మాత్రాన మీ ముఖంలో నేను కేసీఆర్‌ను…

