ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారబోయే ‘స్త్రీశక్తి’ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భద్రత అంశంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం…

