హైదరాబాద్‌లో మరో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో మీరాలం చెరువుపై రూ. 430 కోట్ల వ్యయంతో ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఐకానిక్ కేబుల్ వంతెన బెంగళూరు జాతీయ రహదారి వద్ద శాస్త్రిపురం నుండి చింతల్‌మెట్ రోడ్‌ను కలుపుతుంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడ్‌లో నిర్మించనున్నారు.…

