స్టేజ్‌పై స్టెప్పులేసిన రెహమాన్: ‘మూన్‌వాక్’ వేడుకలో ప్రభుదేవాతో కలిసి సందడి చేసిన మ్యూజిక్ మాస్ట్రో
సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ తన పుట్టినరోజును ‘మూన్‌వాక్’ చిత్ర బృందంతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో రెహమాన్ స్వయంగా ఐదు పాటలను లైవ్‌లో పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా, ఈ చిత్రంతో ఆయన నటుడిగా కూడా అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఈ వేడుకలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆయన బర్త్‌డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది…

