మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ..! రేపే కోర్టు తీర్పు..
మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మల భవితవ్యంపై ఉప్పరపల్లి కోర్టులో కీలక వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్.. తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న…

