Editor

CINEMA

ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’ సినిమా..! ఎప్పుడంటే..?

‘మహావతార్ నరసింహ’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన వెలువడింది.   శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. విడుదలైన…

AP

ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీ సంస్కరణలను స్వాగతించలేని దుస్థితిలో ఉంది: సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో, దేశంలోనే జీఎస్టీ 2.0ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తాయని ముఖ్యమంత్రి…

AP

ఇండోసోల్ కంపెనీ కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదు: మంత్రి అనగాని..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కరేడు వద్ద ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించడంతో, రైతులు పూర్తి స్వచ్ఛందంగానే తమ భూములను పరిశ్రమకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.   శాసనమండలిలో వైసీపీ సభ్యుడు తూమాటి మాధవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి…

AP

హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగింది? ఏపీపీఎస్సీని నిలదీసిన హైకోర్టు..

గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో అసలు హాయ్‌ల్యాండ్‌లో ఏం జరిగిందో బయటపెట్టకుండా నిజాలు దాస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ మూల్యాంకనం చేయనప్పుడు, 65 రోజుల పాటు ఏం చేశారని కమిషన్‌ను సూటిగా ప్రశ్నించింది. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఏపీపీఎస్సీ ఆడుకుంటోందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.   గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి…

TELANGANA

జీఎస్టీ కమిటీని నియమించిన తెలంగాణ బీజేపీ..

బీజేపీ రాష్ట్ర స్థాయిలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పై తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలు, సవరణలను ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేసేందుకు.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాపార వర్గాలకు సమాచారం అందించడం, కేంద్ర విధానాలను సమర్థవంతంగా ప్రోత్సహించడం లక్ష్యంగా ముందుకు సాగనుంది. కమిటీలో ప్రముఖులు బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రాముఖ్యత కలిగిన నేతలను చేర్చింది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి,…

TELANGANA

విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం..

తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.   ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం…

National

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: జైషే మహమ్మద్ వీడియో వైరల్..

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని ఆ సంస్థ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో జరిపిన వైమానిక దాడిలో తమ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ మేరకు జైష్ అగ్ర కమాండర్లలో ఒకరైన మసూద్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  …

TELANGANA

తెలంగాణలో అసమర్థ పాలన కొనసాగుతోంది: కేటీఆర్ విమర్శలు..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   గతంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత మానవత్వం…

TELANGANA

ఎంపీల ఓట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు: కౌశిక్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లను ఆయన బీజేపీకి అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.   ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్…

AP

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ భారీ గుడ్ న్యూస్..! ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేష‌న్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.   ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్‌మెన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), హార్టికల్చర్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. వీటిలో రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఒక బీసీ హాస్టల్ వెల్ఫేర్…