అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి..!
రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా కేబుల్ వంతెన నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక వంతెన నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజా ఓటింగ్ నిర్వహించగా, అందులో ఎక్కువ ఓట్లు పొందిన రెండో నమూనా ఎంపికైంది. కూచిపూడి నృత్య భంగిమలో రూపకల్పన ఈ…

