తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదు.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేవలం కేసీఆర్‌కు మాత్రమే దక్కదని, రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయనది ఒక పాత్ర మాత్రమేనని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చిందనే వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర భయాందోళనల మధ్య బతికారని,…

