తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ మహాసంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. తెలంగాణలో ఈసారి విజయం సాధించాలని మొదటి నుంచి భావిస్తున్న కమలనాధులు… సమయం ముంచుకురావడంతో,ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభజన పడుతున్నారు.వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… తెలంగాణలో ఆ ప్రభావం పడిందన్న భావన సర్వత్ర వ్యాపించింది. దీంతో బీజేపీలో చేరికలు ఆగిపోవడం,…

