4news HD TV

AP

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆయన బదులుగా మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆమెకు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి కార్య్రమాల్లో జగన్ కు బదులుగా ప్రభుత్వ ప్రతినిధిగా అమర్నాథ్ వ్యవహరించనున్నారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి టూర్ సందర్భంగా మంత్రి అమర్నాధ్ హోదాను పెంచుతూ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా ఖరారు చేసారు. తొలి సారి మంత్రి అయిన అమర్నాధ్ కు అరుదైన అవకాశం లభించడం…

TELANGANA

తెలంగాణ వారందరికీ శుభవార్త.. 10 రోజుల్లోనే ప్రారంభం

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొస్తోంది. గర్భిణీలకు (Pregnant) పౌష్టికాహారం అందించి.. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా.. న్యూట్రిషన్ కిట్స్ (Nutrition Kit scheme) అందించబోతోంది. మరో పది రోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్‌ను హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన…

AP

బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం

బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఆఫీసులు పెట్టి… ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదేనంటూ ఆర్భాటంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీన్ని నమ్మిన నిరుద్యోగులు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి ఇరుక్కుపోయారు. విజయవాడ లో అల్ఫబేట్ గ్రూప్ స౦స్ద నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ పెట్టింది. ఐసీడీఎస్‌లో ఉద్యోగాలు అ౦టూ వ౦దల మ౦ది నిరుద్యోగుల ను౦డి రూ. 4 లక్షల ను౦డి…

NationalTechnology

ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ న్యాయ పోరాటం.. సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు

ఇస్రో(Indian Space Research Organisation – ISRO) లో దేశీయంగా క్రయోజెనిక్ ఇంజిన్ ను రూపొందించడానికి కృషి చేసిన కేరళకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్.. ఇస్రోకు సంబంధించిన కీలక రహస్య పత్రాలను విదేశాలకు అమ్మేశాడనే ఆరోపణలపై ఆయనను 1994 నవంబర్ లో అరెస్ట్ చేశారు. నంబి నారాయణన్ తో పాటు మరో ఇద్దరు శాస్త్రవేత్తలను కూడా ఇవే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. 1994 డిసెంబర్ లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. Nambi Narayanan…

CINEMA

నోరా ఫతేహీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం

ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. ప్రముఖులను బెదిరించి, రూ. 200 కోట్లను వసూలు చేశాడన్న ప్రధాన ఆరోపణకు తోడు, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసు కూడా సుకేశ్ పై ఉంది. Sukesh gifted costly car to Actor Nora Fatehi :నోరా ఫతేహికి కూడా ఖరీదైన గిఫ్ట్ లు సుకేశ్ చంద్ర శేఖర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు…

NationalTELANGANA

లిక్కర్‌ స్కామ్‌ కేసు.. బిగ్ బ్రేకింగ్‌ : కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.…

CINEMA

ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది హన్సిక. అలాగే టాలీవుడ్ లో రవితేజ, అల్లు అర్జున్, నితిన్, ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించిన మెప్పించింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తన్న విషయం తెలిసిందే.…

AP

కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పై అధికార వైసీపీ కౌన్సిలర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపాడు. తన డివిజన్లో దోమల మందు కొడుతూ కౌన్సిలర్ చంద్రం నిరసన చేపట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పై అధికార వైసీపీ కౌన్సిలర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వార్డులో ఉన్న సమస్యలు చెబుతున్న కమిషనర్ పట్టించుకోవట్లేదని.. గ్రామంలో ఎక్కడ ఏముందో కమిషనర్ కి తెలియదని ఆయన ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా కమిషనర్ గా…

National

మనీలాండరింగ్ కేసులో భాగంగా సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్

తాజాగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో భాగంగా సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసింది. సౌమ్య ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ వద్ద డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తోంది. ఈడీ ఆమెను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెను పదిరోజుల పాటు రిమాండ్‌కు తరలించాలని కోరింది. కాగా 2020 ఫిబ్రవరిలో సీఎం భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ముఖ్యమంత్రి…

CINEMA

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగకు ముందే ఈ సినిమా సెట్స్ మీదకు…