బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ: 2024 ఎన్నికలపై దిశానిర్దేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం దేశ రాజధానిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేవంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరింతగా ప్రజల మద్దతు సంపాదించడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ ప్రభుత్వం లేని చోట తమ స్థానాన్ని ఎలా…

