పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్
ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు. వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా…

