4news HD TV

TELANGANA

తెలంగాణలోని ఈ అందమైన గుహల గురించి మీకు తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందాలకు కూడా కొదువ లేదు. ఎత్తైన కొండలు, వాటర్‌ ఫాల్స్‌, పచ్చని అడవులు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో కళా సంపదతో పాటు అద్భుతమైన శిలా సంపద కూడా ఉంది. ముఖ్యంగా కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న శిలాసంపద ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తుంది. అయితే చందంపేటలో ఉన్న శిలాసంపదైన రంగు గుహలు.. వసతులు లేక సరైన గుర్తింపుకు నోచుకోలేదు.…

CINEMA

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ అస్వస్థత

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 30ఇయర్స్ పృథ్వీ దర్శకుడిగా మారి ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి బెడ్‌ మీదున్న ఆయన మాట్లాడుతూ.. ”డైరెక్టర్‌గా తొలి ప్రయత్నం చేశాను. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా.…

World

విధ్వంసం.. నిరసనలు.. రోడ్డు దిగ్భంధం

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) వెలుపల అరెస్టు చేయడంతో పాక్ వ్యాప్తంగా అశాంతి, గందరగోళం చెలరేగింది. నిరసనకారులు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ (GHQ)కి వెళ్లే రహదారులను అడ్డుకున్నారు. GHQ ప్రధాన గేటుపై రాళ్ళు, ఇటుకలను విసిరారు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో PTI మద్దతుదారులు విధ్వంసాన్ని సృష్టించారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB), పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు ఇమ్రాన్…

Technology

వాట్సాప్ మనం మాట్లాడుకునేది సీక్రెట్ గా రికార్డు చేస్తోందా?

నిద్రిస్తున్న సమయంలో వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ట్విట్టర్ ఇంజనీర్ క్లెయిమ్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో వాట్సాప్‌ను నమ్మలేమని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగి తన వాదనలకు మద్దతుగా ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశాడు. మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూ వాట్సాప్ ను విశ్వసించలేమని రాశారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో వాయిస్, వీడియో కాల్‌లతో సహా వాట్సాప్ లాంటి ఫీచర్లను తీసుకువస్తున్నట్లు నివేదికలు…

AP

తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్

తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ…

CINEMA

”ది కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు

”ది కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ పరువు తీసినందుకు నోటీసులు పంపారు. ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం మమతాబెనర్జీ ప్రకటించారు. అలాగే ‘ది కాశ్మీర్…

CINEMA

‘అన్నీ మంచి శకునములే’ అంటున్న ‘తొలిప్రేమ’ వాసుకి!

స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి మూవీ విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. వాసుకి నటించిన తొలి తెలుగు సినిమా ‘తొలిప్రేమ’ విడుదలై…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను…

AP

హజ్ యాత్రికులపై అదనపు భారం లేకుండా చూస్తాం..

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే హజ్ యాత్రికులపై అదనపు ఆర్ధిక భారం లేకుండా చూస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హజ్ యాత్రికులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.. కేంద్రాన్ని మరోసారి పరిశీలించాలని కోరాం. విమాన టిక్కెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్లే ఖర్చు పెరిగిందన్నారు. విమాన టిక్కెట్ ధరలను తగ్గించమని కోరాం. లేదా, “ఎంబార్కేషన్ పాయుంట్” ను విజయవాడ కాకుండా, హైదరాబాద్ లేదా…

SPORTS

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మే 9వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 54వ మ్యాచ్. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆర్సీబీ, ముంబై జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడిన ఈ ఇరుజట్లు.. ఐదు విజయాలు…