4news HD TV

National

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి. 24 గంటల్లో అధికారం ఎవరిదో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కర్ణాటక జపమే చేస్తున్నాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది అని లెక్కలు వేసుకుంటున్నాయి. అంచనాల్లో తెలంగాణ పార్టీలు.. ప్రతీ పార్టీకీ కొన్ని అంచనాలూ,…

National

రాహుల్‌గాంధీకి శిక్షవేసిన జడ్జి ప్రమోషన్‌

కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, మహారాష్ట్రలో గవర్నర్‌ తీరు సరిగా లేదని బుధవారం తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. బుధవారం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లో కింది కోర్టుల్లో పనిచేసే 68 మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట్ర హైకోర్టు కల్పించిన పదోన్నతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్‌…

National

ఢిల్లీ ప్రభుత్వానిదే అధికారం, కేంద్రానికి కాదంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం వివిధ అంశాలపై వివాదాలకు దారితీస్తోంది. ఎవరి అధికారాలేంటనే విషయంపై స్పష్టత కొరవడటంతో ఒకరి జోక్యాన్ని మరొకరు సహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి పెరిగి పెద్దదై వివాదాలకు దారి తీస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పరిధి విషయంలో చెలరేగిన వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఇరువురి మధ్య అధికారాల విషయంలో చాలాకాలంగా వివాదం రేగుతూనే ఉంది. గతంలో కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి…

National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ రాబోతుంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1 నుంచి వర్తించనుంది. డీఏ పెరుగుదలతో ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. డీఏ పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ…

National

థాక్రే రాజీనామా చేయకుంటే ప్రభుత్వం పునరుద్ధరించేవాళ్లం

 మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ పతనం, బీజేపీ మద్దతుతో షిండే వర్గం పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు సుప్రీంకోర్టు వరకూ చేరాయి. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 15 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వహించడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితుల్లో…

NationalTELANGANA

నిన్న అరెస్టైన ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చింది ఓవైసీయే: బండి సంజయ్

హైదరాబాద్: నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబులపైన హైదరాబాద్ ప్రజలు నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, నిన్న అరెస్టయిన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. 2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను…

TELANGANA

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ రోడ్డు వైపు శిల్పా లేవుట్‌ ఫేజ్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టనున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) నారాయణ్‌ నాయక్‌ వెల్లించారు. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 10వ తేదీ వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. వాహనదారులు గమనించాలని కోరారు. ఈ ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు…

TELANGANA

మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్

 సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారు..? ఎంత మందికి ఇళ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందన్నారు. అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి…

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే ఛాన్స్

    బెంగళూరు: 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వెలుపల పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోలింగ్‌లో భారీ ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు కేంద్రాల వెలుపల బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లతో కళకళలాడగా, ఓటింగ్ ప్రక్రియను సమన్వయం చేయడంలో సిబ్బంది బిజీబిజీగా కనిపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి…

CINEMA

‘ఆదిపురుష్‌’ సినిమాపై నెట్టింట బాయ్‌కాట్‌ ట్రెండ్‌

‘ హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా టి-సిరీస్ ప్రొడక్షన్స్, రెట్రోఫైల్స్ నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ విడుదలకు ముందే వివాదంలో పడింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌తో పాటు సన్నీ సింగ్, దేవదత్తా నాగే సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మే 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాలకే వివిధ సనాతన హిందూ సంస్థలు, కొన్ని…