4news HD TV

APNational

మందుతాగి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు!

ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో మితిమీరి తాగిన ఒక ఆటగాడు ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడట, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది Delhi Capitals player : ఈ IPL సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్.గత సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీం టేబుల్ టాపర్ గా కూడా నిల్చింది, అలాంటి టీం…

AP

నంద్యాల జిల్లా డోన్ పట్టణం 26 వ వార్డు తారక రామా నగర్ లో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేం ఖర్మ

నంద్యాల జిల్లా డోన్ పట్టణం 26 వ వార్డు తారక రామా నగర్ లో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి,ఈ కార్యక్రమంలో వలసల రామకృష్ణ,విజయ బట్,చాటకొండ శ్రీనివాసులు,ప్రజా వైద్యశాల మల్లికార్జున, మురళీకృష్ణ గౌడ్ తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు డోన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

AP

బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

అల్లూరి జిల్లా… దేవీపట్నం మండలం… బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర. చిన్నారి గండి మరియు ముసిని గుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేశామని సర్పంచ్ తుర్రం రమాదేవి,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని చిన్నారి గండి మరియు ముసినిగుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్…

Technology

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడిన పిడుగు..

వరదలు అంటే అమ్మో అంటాం.. భూమి కాస్త కంపిస్తే గజగజా వణికిపోతాం. వడగాలులకు భయపడి ఎవరికి వాళ్లు హౌస్‌ అరెస్ట్ అయిపోతారు. కానీ.. వీటన్నింటికన్నా ప్రమాదకారి పిడుగు. గాయపరచడం ఉండదు. అనారోగ్యానికి గురిచేసే సమస్యేలేదు. సెకన్లలో ప్రాణం తీసేస్తుంది. ఓ మెరుపులా ఉన్నా.. అది తాకితే వేల ఓట్ల విద్యుత్‌ ఒంట్లోకి చేరి క్షణాల్లో మనిషిని బూడిద చేస్తుంది. ఇలాంటి భయంకరమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో…

APTELANGANA

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో కటువైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనప్పటికీ గెలుపునకు అవకాశాలు లేకపోతే రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈకోవలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం చేరుతోంది. నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదంటూ.. : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2004, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా…

AP

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల- ఇలా చూసుకోండి

ఏపీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకే ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా మంత్రి బొత్స హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఆరు గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్…

NationalTELANGANA

సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి.. ఛీఫ్ జస్టిస్‍ను అభ్యర్థించిన స్మితా సబర్వాల్..

బీహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి స్మిత బుధవారం సంఘీభావం తెలిపారు. గోపాల్‌గంజ్ మాజీ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సెంట్రల్ ఐఎఎస్…

AP

తొలిసారిగా ఆయన డైరెక్షన్ లో ప్రభాస్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తోన్న కాంబినేషన్ ఒకటి ఉంది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్-లెక్కల మాస్టర్ సుకుమార్. రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ తన పరిధిని, ఇమేజ్ ను పెంచుకున్నారు. మరోవైపు ప్రభాస్ జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి కథానాయకుడిగా మారిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. పుష్ప2 చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని సుకుమార్ భావిస్తున్నారు. అయితే లైగర్ పరాజయం ఈ సినిమాపై…

AP

వివేకా హత్య వెనక కారణమేంటో చెప్పేసిన వైయస్ షర్మిల..!

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. తన చిన్నాన్న హత్య ఆస్తి కోసం జరగలేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డిపై ఉన్న ఆస్తులన్నీ, ఆయన ఎప్పుడో సునీత పేరు మీద వీలునామా రాశారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆస్తుల కోసం వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సునీత…

National

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మందుపాతర పేల్చేందుకు మావోలు 50 కిలోల ఐఈడీ(IED)ని వినియోగించారు. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున గోతి ఏర్పడింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు చెందిన పోలీసులు ఓ అద్దె వ్యానులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి కనీసం 20 అడుగుల ఎత్తుకు…