4news HD TV

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాని ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాలేదు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించారు కవిత. తన తరఫున న్యాయవాది సోమభరత్‌ను పంపారు. ఈడీ కోరిన సమాచారాన్ని న్యాయవాదితో పంపారు. అనారోగ్యం కారణంగా చూపుతూ.. మరో తేదీన తాను విచారణకు హాజరువతానని చెప్పినట్లు తెలుస్తోంది.

AP

ఏపీకి రెయిన్ అలెర్ట్…

ఏపీకి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది అండి. ఒక ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు Gangetic పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఉత్తర అంతర్గత తమిళనాడు నుండి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు…

AP

ఏపీ లో బడ్జెట్ సమావేశాలు.సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు భారీ కేటాయింపులు..

సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు భారీ కేటాయింపులు ప్రతిపాదిస్తూ రెండు లక్షల 80 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మిన ప్రభుత్వం తమదని ప్రకటించిన ఆర్థిక మంత్రి, అన్నదాతల ఆదాయం పెంచడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. పలికేది భాగవతమట, పలికించె వాడు రామభద్రుడంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తన ఐదో బడ్జెట్‌లో అసెంబ్లీ ముందుంచారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో తమ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు.…

CINEMA

ఇంట్రెస్టింగ్ స్టోరీతో నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్…

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మధ్యనే ఈ మూవీ చివరి షెడ్యూల్ షూట్‌ కూడా జరిగింది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో…

CINEMA

ఎన్టీఆర్ 30 సినిమా నుండి క్రేజీ అప్డేట్…

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ఎప్పుడో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని…

CINEMA

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమా నుండి పవన్ లుక్ లీక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు. ఇక గత నెల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ పై…

CINEMA

ప్రభాస్‌ ఆరోగ్యంపై రూమర్లు..! నిజమేనా..? కదా..?

ప్రభాస్‌ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత సాహో కోసం మళ్లీ స్లిమ్‌గా మారడం, భారీ యాక్షన్‌ సీక్వెన్స్ చేయడంతో ప్రభాస్‌ హెల్త్‌ దెబ్బతిన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో పాన్‌ ఇండియా స్టార్‌ మోకాళ్లకు సర్జరీ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా మరోసారి ప్రభాస్‌ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత…

AP

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల…

TELANGANA

ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేసిన –: మంత్రి కేటీఆర్..

బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారో 2023లో ప్రజలే తీర్పు చెబుతారని సవాల్‌ విసిరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఇటీవల…

TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోమారు విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత. ..

తెలంగాణ రాజకీయాల్లో  ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. రేపు మరోమారు విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశారు. 11న జరిగిన విచారణలో కవిత ఫోన్‌ను సీజ్‌ చేసింది ఈడీ. మరో వైపు ఈడీ సమన్లపై స్టే కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు కవిత. మహిళను ఈడీ ఆఫీస్‌కి ఎలా పిలుస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్‌ సీజ్ విషయాన్ని కూడా…