News

APTELANGANA

కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు… రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలి: షర్మిల..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?” అంటూ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో…

Uncategorized

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ..

పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేశ్‌ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.   ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ… రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్ల తోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు.…

AP

జగన్ పల్నాడు పర్యటనలో ఆంక్షలు ఉల్లంఘన .. ఎస్పీ కీలక వ్యాఖ్యలు..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాయి. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది.   జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా,…

TELANGANA

తెలంగాణలో ఫోన్ ట్యాంపింగ్ అంశంలో మరో మలుపు… షర్మిల ఫోన్ ట్యాప్..!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది.   ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల మొబైల్ ఫోన్లను అత్యంత రహస్యంగా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా…

TELANGANA

జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీలందరూ ఈ విషయంలో చైతన్యవంతులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే, పదవులు వాటంతటవే బీసీ బిడ్డల కాళ్ల దగ్గరకు వస్తాయని పేర్కొన్నారు.   ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను సాధించేంత వరకు పోరాడుతామని ఆమె అన్నారు. మెదక్ జిల్లాలో “కామారెడ్డి…

AP

ఏపీలో ప్లాస్టిక్ నిర్మూలనకు పటిష్ట చర్యలు..!

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచుల వినియోగాన్ని విరివిగా ప్రోత్సహించాలని సూచించారు.   మంగళవారం…

National

మత్స్యకారుల వలకు చిక్కిన ఓ అరుదైన, వింతైన చేప..! ఎక్కడంటే..?

తమిళనాడు సముద్ర తీరంలో ఓ అరుదైన, వింతైన చేప మత్స్యకారుల వలకు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 30 అడుగుల పొడవున్న ఈ చేపను ‘ఓర్ ఫిష్’ అని పిలుస్తారు. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే, ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో, ఈ నెల ఆరంభంలో పట్టుబడిన ఈ…

Uncategorized

ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం..! కేటిఆర్ సెల్‌ఫోన్స్ సీజ్ ..!

ఫార్ములా-ఈ రేస్ కేసు. కేటీఆర్‌ను ఇప్పటికే ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది. సెల్‌ఫోన్స్ సీజ్ చేయాలని చూసింది. కానీ, ముందే జాగ్రత్త పడిన కేటీఆర్.. విచారణకు మొబైల్ ఫోన్లు తీసుకురాలేదు. ఆనాడు వాడిన ఫోన్లు ఇవ్వాల్సిందేనంటూ ఏసీబీ అల్టిమేటం జారీ చేసింది. ఫోన్లు అయితే ఇస్తారేమో కాని అందులో డేటా డిలీట్ చేసి ఉంటారుగా? అనే డౌట్ కూడా ఉంది. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కవిత అలానే చేశారు. దర్యాప్తు సంస్థలకు అందజేసిన తన మొబైల్…

TELANGANA

తెలంగాణకు కొత్తగా 7 నవోదయ స్కూళ్లు..!

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కొత్తగా మరో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2024 డిసెంబర్ లోనే.. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లిభించింది. అయితే ఇప్పుడు పరిపాలనాపరమైన అనుమతులు ఖరారయ్యాయి. ఈ నవోదయ విద్యాలయాల మంజూరుతో రాష్ట్రంలో మరింత నాణ్యమైన విద్య పిల్లలకు…

AP

లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్..! చెవిరెడ్డి అరెస్టు, ఇంకా ఎంత మంది ఉన్నారో..?

ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటివరకు అధికారులపై దృష్టి పెట్టిన సిట్.. ఇప్పుడు నేతలపై గురిపెట్టారా? ఈ క్రమంలో చెవిరెడ్డిని అరెస్టు చేశారా? రేపో మాపో వైసీపీ కీలక నేతలు అరెస్టు కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   ఏపీ లిక్కర్ కేసు కేవలం అధికారుల మాత్రమే నడిపించారని నిన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టు కావడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అసలు లిక్కర్‌ కేసుకు ఈయనకున్న…